Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

దసరా పండుగకు..

Ram

జె.ఎస్.ఆర్. మూవీస్ పతాకంపై  హరికృష్ణ జొన్నలగడ్డ, అక్షిత హీరోహీరోయిన్లుగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ప్రేమెంత పని చేసే నారాయణ’.  శ్రీమతి భాగ్యలక్ష్మి సమర్పణలో సావిత్రి జొన్నలగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఇటీవల వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా విడుదలైన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రంలోని సాంగ్ విజువల్స్‌ను సినీ, రాజకీయ ప్రముఖులు ఆవిష్కరించారు. ‘అట్టా సూడమాకు…’ పాట విజువల్‌ను జయప్రద, ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్‌సింగ్ ఆవిష్కరించగా, ‘ఈ బుజ్జిగాడికి నచ్చేశావే..’ పాటను దర్శకుడు క్రిష్, ‘హరిలో రంగ హరి..’ విజువల్ సాంగ్‌ను రవితేజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో దర్శకుడు జొన్నలగడ్డ శ్రీనివాసరావు మాట్లాడుతూ “ఇటీవల వైయస్ జగన్ చేతుల మీదుగా విడుదలైన ఆడియో సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వస్తోంది. అలాగే వీడియో సాంగ్స్‌ను విడుదల చేసిన జయప్రద, క్రిష్, రవితేజలు హరి డాన్స్ చూసి ఎంతో మెచ్చుకున్నారు. జగపతిబాబు ఇచ్చిన వాయిస్ ఓవర్ సినిమాకు ఎంతో ప్లస్ అవుతుంది. ఇందులో లవ్‌తో పాటు ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటుంది”అని అన్నారు. హీరో జొన్నలగడ్డ హరికృష్ణ మాట్లాడుతూ “పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి.  ఈ చిత్రం హీరోగా నాకు మంచి పేరు తెస్తుంది”అని తెలిపారు. హీరోయిన్ అక్షిత మాట్లాడుతూ “నా క్యారెక్టర్‌కు సినిమాలో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇంత మంచి అవకాశాన్నిచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు”అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆదిత్య నిరంజన్, యాజమాన్య తదితరులు పాల్గొన్నారు.

Comments

comments