Home తాజా వార్తలు నటుడు రావు రమేష్‌కు మాతృవియోగం

నటుడు రావు రమేష్‌కు మాతృవియోగం

KAMALA

హైదరాబాద్ : దివంగత నటుడు రావు గోపాలరావు సతీమణి, రావు రమేష్ తల్లి కమలా కుమారి (73) శనివారం కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న కమలాకుమారి కొండాపూర్‌లోని తన నివాసంలో కన్నుమూశారు. కమలాకుమారి స్టేజ్ ఆర్టిస్ట్‌గా పని చేశారు. ఆమెకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. ఆమె పెద్ద కొడుకైన రావు రమేష్ తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ నటుడుగా ఉన్నారు. కమలాకుమారి మృతిపై పలువురు సంతాపం వ్యక్తం చేశారు.

Actor Rao Ramesh Mother Passed Away