Home తాజా వార్తలు కనకదుర్గమ్మ సేవలో సాయికుమార్

కనకదుర్గమ్మ సేవలో సాయికుమార్

Actor Saikumar visited the Kanakadurgamma Temple

విజయవాడ : ప్రముఖ సినీనటుడు సాయికుమార్ తన కుటుంబంతో కలిసి మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు ఆయనకు ఘనస్వాగతం పలికి దర్శన ఏర్పట్లు చేశారు. విజయవాడకు ఎప్పుడొచ్చినా, తాను తప్పకుండా కనకదుర్గమ్మను దర్శించుకుంటానని ఆయన తెలిపారు. కృష్ణాతీరంలో జరిగే హారతికి నేపథ్య గానం అందివ్వడం తన పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. గతంతో పోలిస్తే విజయవాడ నగరం చాలా అభివృద్ధి చెందిందని ఆయన తెలిపారు. తనకు టివితో పాటు సినిమాల్లోనూ మెండుగా అవకాశాలు వస్తున్నాయని ఆయన చెప్పారు.

Actor Saikumar visited the Kanakadurgamma Temple