Search
Wednesday 21 November 2018
  • :
  • :

సల్మాన్ నిర్దోషి…

Salman-Khanజైపూర్: వన్య ప్రాణులను వేటాడిన కేసులో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్‌కు ఊరట లభించింది. ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా పేర్కొంటూ రాజస్థాన్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. 1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ కోసం సల్మాన్ రాజస్థాన్ వెళ్లారు. ఆ సమయంలో జోధ్‌పూర్ శివారులోని అటవీ ప్రాంతంలో సల్మాన్ అక్రమంగా రెండు కృష్ణజింకలను వేటాడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు అతడిపై రెండు కేసులు నమోదు చేశారు. దీనిపై విచారించిన జోధ్‌పూర్ కోర్టు రెండు కేసుల్లోనూ ఏడాది, ఐదేళ్లపాటు జైలు శిక్ష విధించింది. అయితే స్థానిక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ, రాజస్థాన్ హైకోర్టులో సల్మాన్ పిటిషన్ దాఖలు చేశారు. మే చివరి వారంలోనే ఈ కేసుకు సంబంధించి వాదనలు పూర్తి కాగా.. తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో పెట్టింది. అయితే ఈ కేసులో సల్మాన్‌ను నిర్దోషిగా పేర్కొంటూ హైకోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. కాగా, రంజాన్ కానుకగా విడుదలైన సల్మాన్ సుల్తాన్ మూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

Comments

comments