Search
Sunday 23 September 2018
  • :
  • :

శ్రీరెడ్డిపై శివబాలాజి ఫిర్యాదు…

Actor Shiva Balaji Complaint against Sri Reddy

హైదరాబాద్: టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి ఇటీవల అగ్రనటుడు, జనసేనాని పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెపై పలువురు సినీ పెద్దలతో పాటు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా శ్రీరెడ్డిపై నటుడు శివబాలాజీ రాయదుర్గం పిఎస్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌పై వ్యక్తిగత దూషణలకు దిగిన ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. పవన్‌పై ఇలా అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై ఓ న్యాయవాది మాట్లాడుతూ… ఈ కేసు సమర్థవంతంగా కొనసాగితే ఆమెకు రెండు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందన్నారు. ఇంతకుముందు తన అభిమాన నటుడు పవన్‌ను శ్రీరెడ్డి కించపరిచారని పంజాగుట్ట కాలనీకి చెందిన వీడియో ఎడిటర్ శశాంక్ వంశీ మంగళవారం పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Comments

comments