Home సినిమా భారతీయ సంస్కృతిలోని అనుబంధాలు, ఆప్యాయతలు

భారతీయ సంస్కృతిలోని అనుబంధాలు, ఆప్యాయతలు

Sunil

సునీల్, మనీషా రాజ్ హీరోహీరోయిన్లుగా శంకర్ దర్శకత్వంలో మహాలక్ష్మీ ఆర్ట్ ప్రొడక్షన్ నం.2 చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీలో ఒక పాట చిత్రీకరిస్తే మొత్తం షూటింగ్ పార్ట్ పూర్తవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్‌లోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శంకర్ మాట్లాడుతూ “మలయాళ చిత్రం ‘టు కంట్రీస్’కు రీమేక్ ఈ చిత్రం. ఇప్పటికే యుఎస్‌లో 32 రోజలు పాటు షూటింగ్ చేశాం. ఈ షూటింగ్‌కు అమెరికాలోని స్థానికులు చాలా మంది ఎంతో సహాయం చేశారు. 11 మంది ప్రధాన నటీనటులతో యుఎస్‌లో షూటింగ్ పూర్తిచేశాం. ఇంకా ఒక పాట బ్యాలెన్స్ ఉంది. సునీల్ బాడీలాంగ్వేజ్‌కు ఈ కథ బాగా సరిపోతుంది. భారతీయ సంస్కృతిలో ఉండే అనుబంధాలు, ఆప్యాయతలను ఈ చిత్రంలో చూపిస్తున్నాం”అని అన్నారు. హీరో సునీల్ మాట్లాడుతూ “మంచి సబ్జెక్ట్‌తో తెరకెక్కుతున్న చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేవిధంగా దర్శకుడు శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు”అని చెప్పారు. ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్, నరేష్, పృథ్వీ, కృష్ణభగవాన్, షాయాజీ షిండే, రాజా రవీంద్ర, సంజన, దేవ్ గిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.