Home జాతీయ వార్తలు నటుడు ఎస్‌వి రంగారావు విగ్రహ ఆవిష్కరణ

నటుడు ఎస్‌వి రంగారావు విగ్రహ ఆవిష్కరణ

Actor SV Ranga Rao Statue Discovery by AP CM Chandra babu

ఏలూరు : ఏలూరు కలపర్రు టోల్‌గేట్ సమీపంలోని వై జంక్షన్ వద్ద దివంగత నటుడు ఎస్‌వి రంగారావు విగ్రహాన్ని ఎపి సిఎం చంద్రబాబునాయుడు మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలుగువారి చరిత్రలో శాశ్వతంగా గుర్తు పెట్టుకొనే నటుడు ఎస్‌వి రంగారావు అని ఆయన పేర్కొన్నారు. ఎస్‌వి రంగారావులా సంభాషణలు పలికే వ్యక్తి గతంలో లేరని, భవిష్యత్‌లో ఉండబోరని ఆయన అన్నారు. మహానటుడు ఎస్‌వి రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించడం తన పూర్వ జన్మ సుకృతమని బాబు పేర్కొన్నారు. ఎస్‌వి రంగారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రాంతంలోనే మ్యూజియం ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని బాబు వెల్లడించారు.

Actor SV Ranga Rao Statue Discovery by AP CM Chandra babu