Home తాజా వార్తలు హీరో విక్రమ్ కుమారుడి కారు బీభత్సం..!

హీరో విక్రమ్ కుమారుడి కారు బీభత్సం..!

Actor Vikram's son Dhruv's car rams into auto: Chennai

చెన్నై: దక్షిణాది నటుడు చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ తమిళనాడు రాజధాని చెన్నైలోని ఓ రోడ్డుపై బీభత్సం సృష్టించాడు. ఆదివారం ఉదయం అతివేగంగా కారు నడిపిన అతడు కంట్రోల్ చేయలేక పక్కన ఉన్న మూడు ఆటోలను బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ ఆటో డ్రైవర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. సమాచారం అందుకున్న పాండీ బజార్ పోలీసులు వెంటనే ప్రమాదస్థలికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. అయితే,  ప్రమాదం జరిగిన సమయంలో ధృవ్ మద్యం తాగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ధృవ్ గతేడాది తెలుగులో విడుదలై ఘన విజయం సాధించిన ‘అర్జున్ రెడ్డి‘ తమిళ రీమేక్ వర్మతో అరంగేట్రం చేస్తున్నసంగతి తెలిసిందే. ఆ తర్వాత శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో రాబోతున్న ద్విభాష చిత్రంలోనూ ధృవ్ నటించనున్నట్లు తెలుస్తోంది.