Home తాజా వార్తలు నటుడు వినోద్ ఇకలేరు

నటుడు వినోద్ ఇకలేరు

Actor-Vinod

హైదరాబాద్: టాలీవుడ్‌లో సీనియర్ నటుడు వినోద్ (59)శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో బ్రెయిన్ స్ట్రోక్‌తో వినోద్ చనిపోయాడని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వినోద్ ఇప్పటివరకు 300పైగా చిత్రాల్లో నటించారు. వినోద్ అసలు పేరు ఆరిశెట్టి నాగేశ్వరరావు, గుంటూరులోని తెనాలి ప్రాంతంలో జన్మించారు. మిర్చి, చంటి, లారీ డ్రైవర్, ఇంద్ర వంటి చిత్రాల్లో ఆయన నటించారు. తమిళంలో 28, హిందీలో నాలుగు చిత్రాలతో పాటు వెండితెరపై కూడా మెరిశారు. వినోద్‌ 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వినోద్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేయడంతో కుటుంబానికి సానుభూతి ప్రకటించారు.