Home సినిమా ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు

ఆనందోత్సాహాల మధ్య జన్మదిన వేడుకలు

actors krishnam raju and naresh birthday celebrations
ప్రముఖ నటులు కృష్ణంరాజు, నరేష్‌లు తమ జన్మదినోత్సవాన్ని ఆదివారం ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. రెబల్‌స్టార్ కృష్ణంరాజు 79వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని తన నివాసగృహంలో కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన బర్త్‌డేను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ వేడుకలో ఆయన భార్య శ్యామలదేవి, కుమార్తెలు, ప్రభాస్‌తో పాటు అధిక సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఇక సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల సమక్షంలో సీనియర్ నటుడు నరేష్ తన 59వ జన్మదినోత్సవాన్ని ఆనందంగా జరుపుకున్నారు. నానక్‌రామ్‌గూడలోని నివాస గృహంలో కుటుంబసభ్యులు, అభిమానుల కేరింతల మధ్య ఈ బర్త్‌డే వేడుక జరిగింది.

actors krishnam raju and naresh birthday celebrations