Home సినిమా ప్రేమ గురించి చెప్పేసింది

ప్రేమ గురించి చెప్పేసింది

Alia-Bhatt

బాలీవుడ్‌లోని ప్రేమ కథలు ఒక్కొక్కటిగా సక్సెస్ అవుతున్నాయి. పలువురు ప్రేమికులు పెళ్లి వైపు అడుగులు వేస్తున్నారు. సోనమ్‌కపూర్, నేహా ధూపియా ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ కుర్రాడు నిక్ జోనాస్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఈ ఏడాది చివరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నారు. ఇక తాజాగా రణవీర్ సింగ్, దీపికా పదుకునే కూడా తమ పెళ్లికి ముహూర్తం ఖరారు చేశారు. వీరి పెళ్లి నవంబర్ 14-15 తేదీలలో జరుగబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక బాలీవుడ్ జనాలు అత్యంత ఆసక్తిగా చూస్తున్న జంట రణబీర్‌కపూర్-అలియాభట్. యంగ్‌హీరో రణబీర్ ప్లేబాయ్‌గా గతంలో పలువురు అమ్మాయిలతో ఎంజాయ్ చేశాడు. ఒక దశలో స్టార్ బ్యూటీ కత్రినాకైఫ్‌తో పెళ్లికి దగ్గరగా వెళ్లాడు. కానీ ఆ బంధం నిలవలేదు. ప్రస్తుతం రణవీర్ యంగ్ బ్యూటీ అలియాభట్‌తో ప్రేమాయణాన్ని కొనసాగిస్తున్నాడు. అయితే తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు వీళ్లు బయటపెట్ట లేదు. తాజాగా కరణ్‌జోహార్ నిర్వహించే ఓ టివి ప్రోగ్రామ్‌లో అలియా తన ప్రేమ విషయాన్ని చెప్పేసింది. తాను రణబీర్ కపూర్‌తో ప్రేమలో పడ్డానని పేర్కొంది. అయితే అతనితో పెళ్లి ఎప్పుడు అనే విషయాన్ని మాత్రం అలియాభట్ చెప్పలేదు.

Actress Alia bhatt in Love With Ranbir Kapoor 

Telangana News