Search
Friday 16 November 2018
  • :
  • :

మత్తు మలుపు

సిట్‌పై చార్మి రిట్ 

 పెళ్లికాని పిల్లను, విచారణ ఇష్టారాజ్యాంగా జరిపితే నష్టపోతాను  

మీడియా దుష్ప్రచారానికి నాకు సంబంధం లేదు  

నేడు హైకోర్టులో విచారణకు రానున్న కేసు 

Charmi

హైదరాబాద్ : డ్రగ్స్ కేసులో చిక్కుకున్న తెలుగు సినీ ప్రముఖుల కేసులు కలకలం రేపుతున్న నేపథ్యంలో ప్రముఖ హీరోయిన్ చార్మి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. డ్రగ్స్ కేసులో సిట్ నుంచి నోటీసులు అందుకున్న చార్మికౌర్ “సినిమా పరిశ్రమలో ఒక వర్గం, మీడి యా ఒత్తిళ్ళకు తలొగ్గనందుకే నాపై తప్పుడు ప్రచారానికి తెర లేచింది. బలవంతంగా రక్తం, గోళ్లు వంటి నమూనాలు తీసుకునే అవకాశాలున్నాయి. విచారణ అధికారుల ఇష్టానుసారంగా జరిగితే తాను తీవ్రంగా నష్టపోతాను. పెళ్లి కాని యువతిని. ఇలాంటివి జరిగితే తీవ్ర పరిణామా లు తన జీవితంపై ఉండనున్నాయి. వ్యక్తిగత గో ప్యత పాటించేలా చేయాలి. కీర్తి ప్రతిష్టలు దిగజారితే తర్వాత నిజాలు తెలిసినా అవి తిరిగి రావు. ఒక వర్గం మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారానికి తనకేమీ సంబంధం లేదు. కేసు విచారణకు వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నాను. అయితే తనకు చట్ట ప్రచారం కల్పించాల్సిన రక్షణలకు ఆదేశాలు జారీ చేయండి. విధిలేని పరిస్థితుల్లోనే హైకోర్టును ఆశ్రయించాల్సివచ్చింది. తనకేమీ డ్రగ్స్ దందాతో సంబంధం లేదు. మంచి నటిగా పేరున్న తన ప్రతిష్టకు భంగం కలిగించేలా జరుగుతోంది. టీవీల టిఆర్‌పి రేటింగ్స్, పత్రికల అమ్మకాల కోసమే అన్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోంది. చార్మినార్, బాలానగర్, నాంపల్లి పోలీస్ స్టేషన్‌లో నమోదనయిన కేసుల్లో నోటీసులు  అందుకున్నారు.  విచారణకు  వెళ్లినప్పుడు ఎక్సైస్ పోలీసులు  తన నుంచి బలవంతంగా గోళ్లు, రక్తం , జుట్టు వంటి నమూనాలు తీసుకోరాదు. సుప్రీం కోర్టు  గతంలో  పేర్కొన్న  మార్గదర్శకాలకు అనుగుణంగా  న్యాయవాది సమక్షంలో మహిళా పోలీసులతోనే విచారణ  జరిపించాలి. బలవంతంగా వాంగ్మూలాన్ని తీసుకోకూడదు” అని ఆదేశాలు జారీ చేయాలని హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యంలో కోరారు.  ప్రతి వాదులుగా ప్రత్యేక దర్యాప్తు  బృందం (సిట్) సూపరింటెండెంట్, తెలంగాణ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ సెక్రటరీ/ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌లను చేశారు. మంగళవారం ఈ కేసు హైకోర్టు విచారణకు రానుంది.

Comments

comments