Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

హన్సిక గార్జియస్ లుక్‌…

Hansika

హైదరాబాద్: దేశముదురు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ హన్సిక. ఈ సినిమాలో సన్యాసినిగా ఆమె పాత్ర కుర్రకారును బాగానే ఆకట్టుకుంది. తాజాగా ఆమె నటిస్తున్న తెలుగు చిత్రం ‘గౌతమ్ నంద’. సంపత్‌నంది దర్శకుడు, గోపిచంద్ హీరో. శుక్రవారం ఈ చిత్రానికి సంబంధించిన హన్సిక లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

తంబూర పట్టుకుని ఉన్న హన్సిక లుక్ సింప్లీ సూపర్బ్‌గా ఉంది. మరోవైపు ఇప్పటికే విడుదలైన గౌతమనంద టీజర్, ఫోటోలకు మంచి స్పందన లభిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన హన్సిక లుక్ మూవీపై అంచనాలు మరింతా పెంచేలా ఉంది. యంగ్‌తరంగ్ ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ మూవీ ఆడియో వేడుక త్వరలో నిర్వహించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.

Comments

comments