Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

త్రివిక్రమ్ చిత్రంలో లయ?

laya

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల్లో అతని డైలాగులతో పాటు నటీనటులు కూడా ఉంటారు. తన సినిమాల్లోని  కథ హీరోతో పాటు ఖచ్చితంగా మరో ముఖ్యమైన పాత్ర చుట్టు కూడా తిరుగుతుంది. అలాంటి ముఖ్యమైన పాత్ర కోసం నటులను జాగ్రత్తగా ఎంపికచేసుకుంటాడు త్రివిక్రమ్. అతని సినిమాలు అత్తారింటికి దారేది, అ..ఆ సినిమాల్లో నదియా, అజ్ఞాతవాసి చిత్రంలో ఖుష్బూ ముఖ్యమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించారు. తాజాగా ఎన్టీఆర్ హీరోగా సినిమాను తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నాడు త్రివిక్రమ్. ఇందులోనూ ఓ ముఖ్యమైన పాత్ర కోసం ఒకప్పటి హీరోయిన్‌ను తీసుకుంటున్నాడట. స్వయంవరం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై కొన్నాళ్లపాటు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన తెలుగమ్మాయి లయ పెళ్లి చేసుకున్న తర్వాత  సినిమాలకు గుడ్‌బై చెప్పేసి వెళ్లిపోయింది. ‘ప్రేమించు’ సినిమాలో నటిగా తన టాలెంట్ ఏంటో ఆమె చూపించింది. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమాలో లయ నటించే అవకాశముందని తెలిసింది. త్రివిక్రమ్ ఆఫర్‌కు లయ ఒప్పుకొని ఈ సినిమాలో నటిస్తే మరో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టు టాలీవుడ్‌కు దొరికినట్టే.

Comments

comments