Home సినిమా దీపావళి పార్టీలో హల్‌చల్

దీపావళి పార్టీలో హల్‌చల్

nayantara

స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ దర్శకుడు విఘ్నేష్ శివన్‌ల మధ్య ప్రేమాయణం జోరుగా సాగుతోంది. కొంతకాలం క్రితం ఏకాంతంగా గడిపేందుకు విదేశాలకు వెళ్లిన వీళ్లిద్దరు ఇప్పుడు చెన్నైలో ఎప్పుడుపడితే అప్పుడు కలుసుకుంటున్నారు. ఇక దీపావళి సందర్భంగా కోలీవుడ్‌కు చెందిన కొందరు కలిసి పార్టీ చేసుకున్నారు. వీళ్లలో నయన్, విఘ్నేష్‌తో పాటు హీరో శివ కార్తికేయన్, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, దర్శకుడు అట్లీ తదితరులున్నారు. దాదాపు 15 మంది కలిసి పార్టీ చేసుకుంటే అందులో నయన్, విఘ్నేష్ మాత్రమే హైలైట్ అయ్యారు. వీళ్లిద్దరు పార్టీని పూర్తిగా ఎంజాయ్ చేశారు. ఇలా పండుగకు నయన్, విఘ్నేష్ కలవడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఓనమ్ పండుగ సందర్భంగా ఏకంగా తన ఇంటికే విఘ్నేష్‌ను ఆహ్వానించింది నయనతార. అప్పుడే వీళ్లిద్దరి బంధానికి నయన్ కుటుంబ సభ్యుల నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చేసింది. ఇక అప్పటి నుంచి ఈ జంట హల్‌చల్ చేస్తూనే ఉంది.

Actress Nayanatara Diwali Party Celebrations 

Telangana News