చెన్నయ్ : హీరోయిన్ నయనతార కేరళ సిఎం సహాయ నిధికి రూ.10 లక్షల విరాళాన్ని అందించారు. గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 324 మంది చనిపోయారు. 3.14 లక్షల మంది పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్నారు. వేలాది ఇళ్లు నేలమట్టం కావడంతో లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ క్రమంలో కేరళ ప్రజలను ఆదుకునేందుకు పలువురు హీరోలు కేరళ సిఎం సహాయ నిధికి విరాళాలు అందించారు. ఈ క్రమంలోనే నయనతార కూడా పది లక్షల విరాళాన్ని అందించారు. కేరళ ప్రజలకు అండగా ఉండాలని ఆమె తన అభిమానులకు విజ్ఞప్తి చేశారు. అనుపమ పరమేశ్వరన్ కూడా లక్ష రూపాయలను విరాళంగా అందించారు. దక్షిణ చిత్ర పరిశ్రమ నుంచి కేరళకు సహాయం చేసిన నటీమణులు వీరిద్దరు కావడం గమనార్హం.