Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

పెళ్లి గిళ్లి జాన్తానై… నచ్చిన వ్యక్తితో సహజీవనమే

Nikesha-Patel-Cover

హైదరాబాద్: ‘పులి’ భామ గుర్తుంది కదూ. అదేనండి ‘నా ఫోకస్.. నా మైండ్‌సెట్.. మొత్తం డ్యూటీ మీదే’ అని పవన్‌ను అనుకరిస్తూ ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన నికిషాపటేల్. పులి సినిమా తరువాత తెలుగులో నికిషాకు మంచి అవకాశాలు రాలేదు. అయితే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న’ 7 నాట్కల్’ చిత్రం విశేషాలను తెలుపుతూ… త్వరలోనే అగ్ర హీరోల సరసన నటిస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది.

పెళ్లి ప్రస్తావనా రాగా… ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని… అయినా భార్యాభర్తలుగా జీవించాలంటే పెళ్లి బంధమే అక్కర్లేదని నికిషా అభిప్రాయపడింది. పెళ్లి చేసుకుని వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్న ప్రతీ ఒక్కరూ సంతోషంగా ఉన్నారని చెప్పలేమంది. 2030 సంవత్సరం నాటికి ఇండియాలో పెళ్లి స్థానాన్ని సహజీవనం భర్తీ చేయనుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే తాను కూడా నచ్చిన వ్యక్తితోనే సహజీవనం చేస్తానని చెప్పుకొచ్చింది.

Comments

comments