Search
Saturday 22 September 2018
  • :
  • :
Latest News

డైరెక్షన్ చేస్తుందట!

nithya-meon

తొలి తెలుగు చిత్రం ‘అలా మొదలైంది’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన కథానాయిక నిత్యామీనన్. ఈ చిత్రంతో మంచి అభినయ సామర్థం ఉన్న నటిగా పాపులారిటీ సంపాదించింది. బాలనటిగా కూడా కొన్ని సినిమాల్లో నటించిన నిత్య ఆతర్వాత జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసింది. తర్వాత పూణే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో సినిమాటోగ్రఫీ చేద్దామని  ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఈ నేపథ్యంలో దర్శకురాలు నందినిరెడ్డి కళ్లలో పడడంతో నటిగా ‘అలా మొదలైంది’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా విజయంతో తెలుగు సినిమాల్లోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది. అయితే సినిమాటోగ్రాఫర్ కావాలన్న తన కోరిక తీరనప్పటికీ సినిమాకు దర్శకత్వం వహించాలనే కోరిక బలంగా ఉందట. ఈ విషయం గురించి నిత్యామీనన్ మాట్లాడుతూ “మనసులోని భావాలను దృశ్యంగా మలచడంలోని ఆనందమే వేరు. ఖాళీ సమయాల్లో కథలు రాసే అలవాటు ఉంది. అలా చాలా కథలు రాశాను. ఆ కథలను తెరకెక్కించాలన్న కోరిక ఉంది”అని చెప్పింది. నిత్యామీనన్ ప్రస్తుతం తెలుగులో ‘జనతా గ్యారేజ్’ సినిమాలో నటిస్తోంది.

Comments

comments