Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

నేను చాలా రొమాంటిక్

Bollywood Actress Priyanka Chopra Acting in Hollywood Movie

బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక అక్కడ పాగా వేసిన సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో ‘బేవాచ్’తో గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆతర్వాత ‘క్వాంటికో’ సిరీస్‌తో మరింత పాపులర్ అయింది. అనంతరం రెండు, మూడు హాలీవుడ్ సినిమాల్లో కూడా నటించింది. ఈ క్రమంలోనే ఈ భామ అమెరికన్ సింగర్ నిక్ జోన్స్‌తో ప్రేమలో పడింది. అంతేకాదు వీరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్లిందని పుకార్లు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నిక్‌ను ఇండియాకు తీసుకొచ్చి తన తల్లిదండ్రులకు పరిచయం చేసింది ప్రియాంక. తాజాగా వివాహ వ్యవస్థ గురించి ఈ భామ చేసిన కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకముందని… తాను త్వరలో వైవాహిక జీవితంలోకి అడుగుపెడతానని చెప్పింది. “నేను చాలా రొమాంటిక్. నన్ను ప్రేమించే వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడతాను. ఇద్దరు ప్రేమికుల మధ్య బంధం పెళ్లితో ముడిపడుతుంది. వివాహ బంధంతో ఇద్దరు ప్రేమికులు ఒక్కటవడం నాకెంతో ఇష్టం”అని పేర్కొంది ప్రియాంక చోప్రా.

Comments

comments