Search
Thursday 15 November 2018
  • :
  • :
Latest News

సెప్టెంబర్ 16న పెళ్లి?

Priyanka

తనకంటే పదేళ్లు చిన్నవాడైన హాలీవుడ్ నటుడు నిక్ జోనాస్‌తో ప్రేమలో పడి అతనితో నిశ్చితార్థం కూడా చేసేసుకుంది ప్రియాంక చోప్రా. చడీచప్పుడు లేకుండా ఈ తంతు ముగిసింది. ఇక వీరి పెళ్లి ముహూర్తం కూడా ఖరారైపోయింది. సెప్టెంబర్ 16న ప్రియాంక, నిక్ జోనాస్‌ల పెళ్లి అమెరికాలో జరుగుతుందని అక్కడి మీడియా కథనాలు వెలువరిస్తోంది. నిక్ పుట్టిన రోజైన సెప్టెంబర్ 16న వీరి పెళ్లి జరగడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం ప్రియాంక వయసు 36 ఏళ్లు కాగా సెప్టెంబర్ 16తో నిక్ 26వ సంవత్సరంలోకి అడుగుపెడతాడు. ఇక ఇటీవల ప్రియాంకతో కలిసి నిక్ ఇండియాకు వచ్చాడు. ఆమె కుటుంబాన్ని కలిశాడు. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం జరిగింది. నిక్‌తో పెళ్లి కోసమే సల్మాన్‌ఖాన్ చిత్రం ‘భరత్’ను కూడా వదులుకుంది ప్రియాంక. పెళ్లి తర్వాత ఆమె అమెరికాలోనే స్థిరపడే అవకాశముంది. దీంతో ఆమె బాలీవుడ్ సినిమాల్లో నటించడం దాదాపు కష్టమేనని అంటున్నారు.

Comments

comments