Home గాసిప్స్ అప్పట్లో ఎవరూ తన వైపే చూసేవారు కాదట!

అప్పట్లో ఎవరూ తన వైపే చూసేవారు కాదట!

Rashi-Khanna

మద్రాస్ కేఫ్’ చిత్రంతో సినీ రంగానికి పరిచయమైన హాట్ బ్యూటీ రాశీఖన్నా. ఆ సినిమా తనకు మంచి గుర్తింపు తీసుకురావడంతో ‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆతర్వాత తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ యువతరం కథానాయికల్లో ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది రాశీ.

అయితే చదువుకునే రోజుల్లో ఈ గ్లామరస్ తార వెంట ఎవరూ పడేవారు కాదట. దీనిగురించి రాశీఖన్నా మాట్లాడుతూ “అందం, గ్లామర్ గురించి ఇప్పుడు పట్టించుకొంటున్నాను. కానీ చదువుకునే రోజుల్లో అసలు ఆ ఊసే ఉండేది కాదు. ఎందుకంటే నేను మీరెవరూ ఊహించనంత లావుగా ఉండేదాన్ని. అబ్బాయిలైతే అసలు నా వైపే చూసేవారు కాదు. అందుకే ఎవ్వరూ ప్రేమిస్తున్నా అంటూ నా వెంట పడలేదు.

కానీ మోడలింగ్‌లో అడుగుపెట్టాలనుకొని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నానో… అప్పుడు నా శరీరంపై శ్రద్ధ పెరిగింది. కేవలం కొద్ది నెలల్లోనే నన్ను నేను పూర్తిగా మార్చుకోవడంతో అందరూ ఆశ్చర్యపోయారు. కాలేజీలో ఉన్నడప్పుడు అబ్బాయిలెవరూ నా వెంట పడకున్నా ఇప్పుడు నా అభిమానుల్లో ఎక్కువమంది మాత్రం అబ్బాయిలే”అని చెప్పింది.