Home అంతర్జాతీయ వార్తలు కొలంబో పేలుళ్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్న న‌టి

కొలంబో పేలుళ్ల నుంచి తృటిలో త‌ప్పించుకున్న న‌టి

Actress Radikaaకొలంబో : శ్రీలంక రాజధాని కొలంబోతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఉదయం బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్లలో ఇప్పటి వరకు 138 మంది చనిపోయారు. 400 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. కొలంబోలోని సెయింట్‌ ఆంటోనీ, నెగోంబో పట్టణంలోని సెయింట్‌ సెబాస్టియన్‌, బాట్టికలోవాలోని మరో చర్చితో పాటు శాంగ్రిలా హోటల్‌, సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్‌, కింగ్స్‌బరి హోటళ్లలో  పేలుళ్లు సంభవించాయి.  ఈస్టర్‌ ఆదివారం  సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న భక్తులను టార్గెట్ గా చేసుకుని ఉగ్రవాదులు ఈ బాంబు పేలుళ్లకు పాల్పడ్డారు. కొలంబోలోని సిన్నామన్‌ గ్రాండ్‌ హోటల్ లో బ‌స చేసిన ప్రముఖ నటి రాధికా శరత్ కుమార్ పేలుళ్లకు  కొద్ది నిమిషాల ముందే ఈ హోటల్ ను ఖాళీ చేసి వెళ్లిపోయారు. దీంతో ఆమె పెనుప్రమాదం నుంచి తప్పించుకుంది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు. బాంబు పేలుళ్ల ఘటన తనను షాకింగ్ కు గురి చేసిందని ఆమె పేర్కొన్నారు. ఈ ఘటనను తాను నమ్మలేకపోతున్నాని ఆమె ట్విట్టర్ ద్వారా తెలిపారు.

Actress Radikaa Escaped from Colombo Blasts