Home తాజా వార్తలు కెసిఆర్ అంటే చాలా ఇష్టం: సినీ నటి శరణ్య

కెసిఆర్ అంటే చాలా ఇష్టం: సినీ నటి శరణ్య

 

టిఆర్‌ఎస్ ప్రభుత్వం చాలా నచ్చింది..
సందేశాత్మకమైన ఆర్ట్ వేసిన సినీ నటి శరణ్య

మన తెలంగాణ/సిటీబ్యూరో: రాష్ట్రంలో స్పూర్తిదాయకమైన పరిపాలనను అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం తనకు చాలా నచ్చిందని ఆర్టిస్టు శరణ్య ప్రతాప్ అన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి తనదైన శైలిలో అభినందనలు తెలిపారు. శుక్రవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఈ సందర్భంగా చార్కోల్ రియలిటిక్ ఆర్ట్ అనే వినూత్న చిత్రాన్ని ఆమె సినీ నటుడు కోటేశ్వరరావుతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం శరణ్య మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మహిళల క్షేమం కోసం అమలు చేస్తున్న షీ టీమ్స్, హాక్ ఐ వంటి పథకాలు ఆనందంగా ఉన్నాయని చెప్పారు. ఆ స్పూర్తితోనే తన ఆర్ట్ ద్వారా టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు అభినందనలు తెలుపుతున్నట్టు పేర్కొన్నారు.

తెలంగాణ భవన్ నుంచి సుపరిపాలనను అందిస్తున్న కేసీఆర్ అన్న కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని చిత్రీకరించినట్టు తెలిపారు. ఈ ఆర్ట్‌తో త్రీడీ వ్యూహంతో చిత్రంలోని అంశాలు రియాలిటిక్‌గా కనిపిస్తాయని చెప్పారు. అందరి దృష్టినీ ప్రత్యేకంగా ఆకట్టుకునేలా దీన్ని రూపొందించినట్టు తెలిపారు. వచ్చే తరం సంక్షోభాల రాజకీయాలకు కాకుండా సంక్షేమాల రాజకీయాలకు అలవాటు పడాలనే దృక్ఫథంతో.. వాళ్ళలో చైతన్యం తెచ్చేందుకు తనవంతు ఈ ప్రయత్నం చేసినట్టు చెప్పారు. నటుడు కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎంబీఏ చేసిన శరణ్యను ఆర్టిస్టుగా నిరూపించుకునేందుకు ప్రోత్సహించిన ఆమె తల్లి టీఆర్‌ఎస్ మహిళా విభాగం నాయకులు లతా మహేందర్ అభినందనీయురాలన్నారు. ఓటింగ్ హక్కు వినియోగించుకోవడం కూడా అభివృద్ధి చెందుతున్న సమాజానికి నిదర్శనమని చెప్పారు. అందుకే అధిక శాతం ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో పాల్గొని తమ ఓటు హక్కును సద్వినియోగపర్చుకోవాలని కోరారు. ఆ దిశగా చైతన్యం తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్న ఆర్టిస్టు శరణ్య ప్రతాప్‌ను ఆయన అభినందించారు. సమావేశంలో టీఆర్‌ఎస్ మహిళా విభాగం నేత లతా మహేందర్ పాల్గొన్నారు.

Actress Sharanya pratap draw KCR Ruling TS Govt