Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

పెళ్లయిన తర్వాత మొదటి చిత్రం

Shreya

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్… కంచె, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, బాలకృష్ణతో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ వంటి విజయవంతమైన చిత్రాలకు కెమెరామెన్‌గా పనిచేశారు. ఆయన సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు.  జ్ఞానశేఖర్  నిర్మాతగా వ్యవహిస్తున్న మొదటి సినిమా ప్రారంభోత్సవ వేడుకలో వరుణ్‌తేజ్, క్రిష్, గొట్టిముక్కల పద్మారావు, రాజీవ్ రెడ్డి, సాయిబాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వరుణ్‌తేజ్ క్లాప్ క్లాప్ కొట్టగా క్రిష్ గౌరవ దర్శకత్వం వహించారు. పద్మారావు కెమెరా స్విచ్చాన్ చేశారు. శ్రియాశరణ్, నిహారిక కొణిదెల ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. పెళ్లయిన తర్వాత శ్రియా నటిస్తున్న మొదటి చిత్రం ఇది కావడం విశేషం. కమర్షియల్ అంశాలతో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి సుజనా దర్శకత్వం వహిస్తున్నారు. రమేష్ కరుతూరితో కలిసి జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని క్రియా ఫిలిం కార్పొరేషన్, కాళి ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ః జ్ఞానశేఖర్, సంగీతంః ఇళయరాజా, ఆర్ట్‌ః జె.కె.మూర్తి.

Comments

comments