Home తాజా వార్తలు న‌డిరోడ్డుపై డాన్స్ చేసిన శ్రియ

న‌డిరోడ్డుపై డాన్స్ చేసిన శ్రియ

shriya-saran

అందాల భామ శ్రియ‌  18 సంవ‌త్స‌రాల సినీ కెరియ‌ర్ లో స్టార్ హీరోల అంద‌రి స‌ర‌స‌న న‌టించి మెప్పించింది. 2002 లో సంతోషం సినిమాతో తొలి స‌క్సెస్ అందుకుంది శ్రియ శ‌ర‌ణ్‌. ప్ర‌స్తుతం శ్రియ వ‌యస్సు 36 ఏళ్ళు. 36 ఏళ్ల వయస్సులో  హీరోయిన్ పాత్ర‌ల‌తో పాటు కీల‌కమైన రోల్స్ చేస్తుంది. శ్రియ న‌టించిన న‌ర‌కాసురుడు చిత్రం విడుద‌ల కావ‌ల‌సి ఉంది. త‌మిళంలో న‌ర‌గ‌సూర‌న్ అనే టైటిల్‌తో ఈ చిత్రం రిలీజ్‌కి సిద్దంగా ఉంది. అయితే తాజాగా శ్రియ న‌డిరోడ్డుపై నృత్యం చేసిన వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోస్ట్ చేసింది. విదేశాల‌లో ప్ర‌స్తుతం కార్నివ‌ల్ ఫెస్టివ‌ల్ జ‌రుగుతుండ‌గా, ఆ కార్య‌క్ర‌మంలో భాగంగా శ్రియ స్టెప్పులేసింది. ప్ర‌స్తుతం శ్రియ డ్యాన్స్ వీడియో వైర‌ల్ అయింది.

 

Actress shriya saran dance on Road In Abroad