Home తాజా వార్తలు ‘పేట’పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..!

‘పేట’పై శ్రీరెడ్డి షాకింగ్ కామెంట్స్..!

Actress Sri Reddyఈ సారి సంక్రాంతికి నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఇవాళ బాలయ్య ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ విడుదల కాగా, రేపు(గురువారం) సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘పేట’ విడుదల కానుంది. శుక్రవారం రాంచరణ్ ‘వినయ విధేయ రామ’ వస్తుంటే, ఆ తరువాతి రోజు శనివారంనాడు వెంకీ, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ విడుదల అవుతుంది. దీంతో థియేటర్ల విషయంలో కాంపిటిషన్ ఏర్పడింది. అయితే తెలుగులో రజినీ ‘పేట’ సినిమాకి ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు. మూడు స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతి బరిలో ఉండడంతో ‘పేట’కు థియేటర్ల కొరత ఏర్పడింది. తనకు థియేటర్లు దొరక్కుండా టాలీవుడ్ బడా నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, యూవీ క్రియేషన్స్ వారు ఇబ్బంది పెడుతున్నారని ‘పేట’ తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని వాపోయారు.

ఈ వివాదం ఇంకా కొనసాగుతుండగా, దీనిపై గత కొంతకాలంగా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న వర్ధమాన నటి శ్రీరెడ్డి స్పందించింది. సోషల్ మీడియా వేదికగా ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ”లెజండరీ నటుడు రజినీకాంత్ గారు నటించిన ‘పేట’ మూవీకి తెలుగులో చాలా తక్కువ థియేటర్లు ఇచ్చారు. ఈ విషయంలో టాలీవుడ్ థియేటర్ మాఫియా సిగ్గు పడాలి. సురేష్ బాబు, దిల్ రాజు, అల్లు అరవింద్, సునీల్ నారంగ్ వంటి వారు చిన్న నిర్మాతలు ఆత్మహత్య చేసుకునేలా వ్యవహరిస్తున్నారని” సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మాఫీయా లీడర్లను చంపేయాలని చెప్పుకొచ్చింది. అంతటితో ఆగకుండా మీ కుటుంబ సభ్యులు ఎవరూ సంతోషంగా ఉండలేరని, మీ ఫ్యామిలీలకు సంబంధించిన వ్యక్తుల చిత్రాలను తమిళనాడులో బ్యాన్ చేయాలని సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాగే పేట డిస్ట్రిబ్యూటర్ అశోక్ వల్లభనేని పట్ల ఆమె సానుభూతిని వ్యక్తం చేసింది.