Search
Wednesday 26 September 2018
  • :
  • :

ఉత్తరాది హీరోయిన్లకు శ్రీరెడ్డి గట్టి వార్నింగ్!

Actress Sri Reddy Warns North Side Heroines

హైదరాబాద్: టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్‌పై తనదైన శైలిలో పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి తాజాగా ఉత్తరాది హీరోయిన్లకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. తమ ఉద్యమంపై ఏవరి ఇష్టానికి వారు మాట్లాడితే ఊరుకొనేది లేదని మండిపడ్డారు. ఉద్యమం చిన్నది అని పిచ్చిపిచ్చిగా మాట్లాడితే షూటింగ్ స్పాట్లకు వెళ్లి ధర్నా చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఉస్మానియా విద్యార్థులతో మాట్లాడామని, వారు పూర్తి మద్దతు ప్రకటించారని చెప్పారు. తెలుగు సినీ పరిశ్రమకు బాయ్‌కాట్‌లంటే ఎంటో తెలియదని, ఒకవేళ తమపై ఇష్టానుసారంగా మాట్లాడితే మాత్రం ఇప్పుడు చరిత్రను తిరగరాస్తామన్నారు. ఇప్పటి వరకు లేని పరిస్థితులను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇంతమంది బాధిత అమ్మాయిలు బయటకు వచ్చి సమస్యలు చెబుతున్నప్పుడు ఎందుకు స్పందించడం లేదని ఆమె ప్రశ్నించారు. ఓ టివి ఛానల్‌తో మాట్లాడిన శ్రీరెడ్డి పై వ్యాఖ్యలు చేశారు.

Comments

comments