Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

నాకు అత్యాశలేమీ లేవు

tamanna

మిల్కీబ్యూటీ తమన్నా టాప్ హీరోయిన్‌గా ప్రేక్షకుల్లో తిరుగులేని క్రేజ్‌ను సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగు, తమిళ చిత్రాల షూటింగ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది. టాప్ హీరోయిన్‌గా ఎదగడం గురించి తమన్నా మాట్లాడుతూ “నేను హీరోయిన్‌ను అయినందుకు సంతోషిస్తున్నాను. సినిమా రంగంలో నిత్యం కొత్త కొత్త అనుభవాలను చవిచూస్తున్నాను.

అలాగే ప్రతి చిత్రంలోనూ వైవిద్యభరిత పాత్రలు చేసే అవకాశం లభిస్తోంది. ‘బాహుబలి’ చిత్రాన్ని నా జీవితంలో మరచిపోలేను. అందులో చాలా కష్టపడి నటించాను. అందుకు ఫలితం లభించింది. ప్రేక్షకుల నుండి మరచిపోలేని ప్రశంసలను అందుకున్నాను. ‘బాహుబలి 2’ చిత్రంలో కూడా నటిస్తున్నాను. మంచి పాత్రలు ఎంపిక చేసుకొని నటించడం వల్లే ఇక్కడ నిలబడగల్గుతున్నాను.

నాకు దేవుడిపై అపార నమ్మకం ఉంది. ఆయన కృపాకటాక్షల వల్లే నేనీ స్థాయికి చేరుకోగలిగాను. నాకు ఇష్టమైన దేవుడు సిద్ధి వినాయకుడు. నిత్యం ఆయనకు ప్రణమిల్లి షూటింగ్‌కు బయలుదేరుతాను. నాకు అత్యాశలేమీ లేవు. ఇప్పుడున్న స్థాయిని నిలబెట్టుకుంటే చాలు. భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమైతే ఎవరికి కావలసింది వారు కోరుకుంటామంటారు. నేను మాత్రం ఏమీ కోరుకోను. ఎందుకంటే నాకు కావలసిన దానికంటే ఎక్కువే ఆయన అందించారు. అందుకని దేవుడికి కృతజ్ఞతలు మాత్రమే చెప్పుకుంటాను”అని చెప్పింది.

Comments

comments