Home గాసిప్స్ సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుంది

సమయం వచ్చినప్పుడు పెళ్లి జరుగుతుంది

trisha

నిశ్చితార్థం అయిన కొంతకాలానికి పెళ్లి రద్దు కావడంతో అప్పట్లో త్రిష వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ చెన్నై చిన్నది ఇటీవల ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. “పెళ్లి ఆగిపో యినంత మాత్రాన మరొకరిని ప్రేమించకూడదని ఏమైనా రూల్ ఉందా? మళ్లీ ప్రేమలో పడడానికి నేను సిద్ధంగా ఉన్నాను”అని అంటోంది.

త్రిష మాట్లాడుతూ “వరుణ్‌తో పెళ్లి ఆగిపోవడానికి కారణాలు ఏమిటనేవి నాకు, నా కుటుంబ సభ్యులకు మాత్రమే తెలుసు. దాని వెనుక ఎంతో మంది ఉన్నారు. అవన్నీ మర్చిపోయి నేనిప్పుడు ప్రశాంతంగా సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉన్నాను. ఏ ఆడ పిల్లకైనా సమయం వచ్చినప్పుడు పెళ్లి జరగక తప్పదు. కానీ అది మన చేతుల్లో లేదు. సమయం వచ్చినప్పుడు ఏదీ ఆగదు. ఇప్పుడు కూడా నేను ప్రేమలో పడడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు తగిన వరుడు దొరక్కపోడు కదా”అని చెప్పింది. ప్రస్తుతం తమిళ్‌లో వరుసగా సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉంది త్రిష.