Home సినిమా వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’ మానుకో: వాణీ విశ్వనాథ్

వర్మ.. ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్’ మానుకో: వాణీ విశ్వనాథ్

Laxmi's-NTR

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తన తరువాతి చిత్రంగా ఎన్‌టిఆర్‌ జీవిత చరిత్ర ఆధారంగా ‘లక్మీస్ ఎన్‌టిఆర్‌’ను తెరకెక్కించనున్నారు. ఇందులో మహానటుడి జీవితంలోకి లక్ష్మీపార్వతి వచ్చిన తరువాత జరిగిన పరిణామాలను చూపించబోతున్నట్లు ఆర్‌జివి పేర్కొన్నారు. అయితే ఈ చిత్రంపై సినీయర్ నటి వాణీ విశ్వనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌జివి వెంటనే ఈ ప్రయత్నానాన్ని మానుకోవాలని ఆమె సూచించారు. తెలుగు ప్రజల మనసులో ఆయన ఓ దేవుడిగా ముద్రవేసుకున్నారని చెప్పారు. ఆయన జీవితంపై బాలకృష్ణ ఓ మూవీని తీస్తున్నారు. అది గొప్పగా ఉంటుంది.. ఎందుకంటే తండ్రి కాబట్టి ఆయనను దేవుడిలాగానే చూపిస్తారు అందులో ఎలాంటి సందేహం లేదు.

కానీ, ఆర్‌జివి ‘లక్ష్మీస్ ఎన్‌టిఆర్‌’పై అనుమానాలున్నాయి. సినిమాకు ఒక పేరు పెట్టి మరో సినిమా తెరకెక్కించడంలో దిట్ట వర్మ ఆమె చెప్పుకొచ్చారు. సినిమా పేరులోనే వ్యాపారంతో పాటు వివాదం దాగి ఉందన్నారు. కావున ఎన్‌టిఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాన్ని ఆర్‌జివి విరమించుకోవడం మంచిదన్నారు. అంతేగాక ఎన్‌టిఆర్‌కు కళంకం తెచ్చేలా మూవీ తీస్తే వర్మ ఇంటి ముందు ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. ఎన్‌టిఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక్’ చిత్రంలో వాణీ విశ్వనాథ్ కథనాయికగా నటించిన విషయం తెలిసిందే. ఇక ఇటీవల రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆమె బోయపాటి శీను దర్శకత్వంలో వచ్చిన ‘జయ జానకీ నాయక’ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన విషయం తెలిసిందే.

Actress Vani Viswanath fires on RGV’s Laxmi’s NTR Movie.