Home సినిమా ఐటమ్ సాంగ్స్‌కు సిద్ధమే

ఐటమ్ సాంగ్స్‌కు సిద్ధమే

 

‘హార్ట్ అటాక్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన హీరోయిన్ అదా శర్మ. ఈ భామ అల్లు అర్జున్ చిత్రం ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో ఓ మంచి పాత్ర చేసి ఆకట్టుకుంది. అయితే ఆమెకు వరుసగా తమిళ్, హిందీ భాషల్లో ఏదో ఒక సినిమా ఆఫర్స్ వస్తున్నప్పటికీ లీడ్ హీరోయిన్‌గా ఈ భామకు పెద్దగా అవకాశాలు రావడం లేదు.

తెలుగులో మాత్రం ఛాన్స్‌లు రావడం లేదు. ఈ క్రమంలోనే ఇకనుంచి హీరోయిన్ పాత్రలు చేస్తూనే ఐటమ్‌సాంగ్స్ కూడా చేస్తానంటోంది అదాశర్మ. తాజా సమాచారం ప్రకారం నాని హీరోగా నటిస్తున్న ‘జెర్సీ’లో ఈ భామ ఓ ఐటమ్‌సాంగ్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని తెలిసింది. ఈ ఐటమ్‌సాంగ్‌తో వచ్చే క్రేజ్‌తో తెలుగులో వరుసగా అవకాశాలు దక్కించుకోవాలని అదాశర్మ కోరుకుంటోంది.

 

Adah Sharma says Ready to Item Song