Home మహబూబ్‌నగర్ త్వరితగతిన ఆధార్ అనుసంధానం

త్వరితగతిన ఆధార్ అనుసంధానం

adhar services through the Dharani website soon

త్వరలో ధరణి వెబ్‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి
మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్

మన తెలంగాణ/భూత్పూర్ : రైతుల పాస్ పుస్తకాలకు ఆధార్ లింకప్‌ను వేగవంతం చేయాలని ఇప్పటికే సమయం వృధా అయ్యిందని, పాస్ పుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రోస్ సూచించారు. గురువారం సాయంత్రం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మద్దిగట్ల, గోప్లాపూర్ గ్రామాలకు చెందిన భూ వివరాలు, రైతుబంధు చెక్కులు, పుస్తకాల పంపిణీపై వివరాలు సేకరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ధరణీ (రిజిస్ట్రేషన్ సేవలు) త్వరలో ఏర్పాట్లు పూర్తి చేసి రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేనున్నట్లు వివరించారు. పాస్ పుస్తకాల పంపిణీ అనుకన్న లక్షం మేరకు పూర్తి చేయాలని తహసీల్దార్ జ్యోతికి కలెక్టర్ సూచించారు. త్వరలోనే నూతనంగా ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయానికి సామాగ్రిని తరలించి రిజిస్ట్రేషన్ సేవలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో విఆర్‌ఒలు పాల్గొన్నారు.