Search
Friday 16 November 2018
  • :
  • :

నక్సల్స్ ప్రభావిత జాబితాలో ఆదిలాబాద్

07adadb27p1మన తెలంగాణ / ఆదిలాబాద్: నక్సల్స్ ప్రభావిత జిల్లాగా ఆదిలాబాద్‌ను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల చేసిన ప్రకటన పోలీసు వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాతో పాటు ఉత్తర తెలంగాణలోని ఖమ్మం, కరీంనగర్, వరంగల్ జిల్లాలను కూడా తీవ్రవాద ప్రభావిత జిల్లాలుగా కేంద్రం గుర్తించడం గమనార్హం. మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాలకు ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉండడంతో ఆ రాష్ట్రాల నుండి నక్సలైట్‌ల రాకపోకలు చెరిగిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం నిర్ధారించింది. ఇటీవల నక్సల్స్ అమర వీరుల వారోత్సవాలను జరుపుకోవాలంటూ మావోయిస్టులు బహిరంగంగా పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ అధికారిక ప్రకటన చేయడం ప్రాధాన్యతను సంతరించుకోంటోంది. అయితే నక్సలైట్‌ల కదలికలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు ప్రభావిత జిల్లాలకు భారీగా నిధులు మంజూరు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా కమ్యూనికేషన్ వ్యవస్థను మరింత విస్తరించి అన్నీ గ్రామాలకు కనెక్టివిటీ ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు కేంద్ర సిద్ధం అవుతోంది. నక్సలైట్ కార్యకలాపాలను పూర్తిగా అరికట్టేందు కోసం ఇప్పటికే ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోంది.ఈ కారిడార్‌లో భాగంగా రోడ్ల నిర్మాణానికి భారీ ఎత్తున నిధులు మంజూరు చేయనున్నారు. ఈ నిధలు మంజూరు సంబంధించిన ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుండి ఇప్పటికే సేకరించింది. ఈ ప్రతిపాదన ఆధారంగా జిల్లాకు దశల వారిగా దాదాపు రూ. 300 కోట్ల నిధులు మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే సరిహద్దులో కదలికలు యదావిధిగా కొనసాగుతుండడాన్ని కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని ప్రభావిత జిల్లాగా ప్రకటించింది.

Comments

comments