Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

అదితికి లక్కీ ఆఫర్

aditi-Rao

‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అదితిరావ్ హైదరీ తన అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించి మెప్పించింది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు ఆమెకు కోలీవుడ్‌లో ఓ మంచి అవకాశం దక్కింది. విశాల్‌తో ‘డిటెక్టివ్’ చేసిన మిస్కిన్ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో అదితి హీరోయిన్‌గా నటించనుంది. ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ సినిమాలోని హీరోయిన్ పాత్రకు అదితిరావ్ హైదరీ సరిపోతుందని భావించిన దర్శకుడు మిస్కిన్ ఆమెకు కథ చెప్పడం జరిగింది. తన పాత్ర నచ్చడంతో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించేందుకు ఈ బ్యూటీ అంగీకరించింది. పిసి శ్రీరామ్ కెమెరామెన్‌గా పనిచేసే ఈ చిత్రాన్ని రెడ్ జాయింట్ మూవీస్ పతాకంపై నిర్మిస్తారు.

Comments

comments