Search
Tuesday 20 November 2018
  • :
  • :

లిఫ్టులో చిక్కుకుపోయిన అడిషనల్ సిపి స్వాతి లక్రా

stuck-in-liftహైదరాబాద్: నాంపల్లి సెంట్రల్ క్రైం స్టేషన్ భవనంలోని లిఫ్టు మొరాయించటంతో అడిషనల్ పోలీస్ కమిషనర్ స్వాతి లక్రా కొద్దిసేపు ఇబ్బందికి గురయ్యారు. శనివారం మధ్యాహ్నం ఆమె గ్రౌండ్ ఫ్లోర్‌కు వెళ్లేందుకు పైఫ్లోర్ నుంచి లిఫ్టులో వస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ సమయంలో మొదటి, రెండో ఫ్లోర్‌ల మధ్యలో లిఫ్టు ఆగిపోయింది. వెంటనే సిబ్బంది రంగంలోకి దిగారు. దాదాపు పది నిముషాల తర్వాత తిరిగి లిఫ్టు పనిచేయడం ప్రారంభించింది. దీంతో ఎసిపి స్వాతి సురక్షితంగా కిందికి చేరుకున్నారు.

Comments

comments