Search
Friday 16 November 2018
  • :
  • :

ఆదివాసి మ్యూజియానికి తాళం !

Adivasi2

–  కార్యాలయం ఎదుట బైఠాయించిన కళాకారులు

– నిరాశతో వెనుదిరిగిన భక్తులు, పర్యాటకులు

మేడారం : మేడారంలో ప్రభుత్వం ఆర్బాటంగా ప్రారంభించిన ఆదివాసీ గిరిజన మ్యూజియానికి అప్పుడే గ్రహణం పట్టింది. జాతరకు వచ్చే భక్తులు గిరిజన మ్యూజియంలో సమ్మక్క-సారలమ్మల జీవిత చరిత్రను తెలియజేసే చిత్రకళాఖండాలతోపాటు సమ్మక్క-సారలమ్మలు ఉపయోగించిన వస్తువులు, ఆయుధాలన్నింటిని అక్కడ ఏర్పాటు చేశారు. వీటిని చూస్తే సమ్మక్క-సారలమ్మల చరిత్ర తెలిసిపోతుంది. అదేవిధంగా ఆదివాసీల జీవన విధానాన్ని ప్రతిబింబించే కళాఖండాలను కూడా ఏర్పాటు చేశారు. కాని అధికారులు మ్యూజియాన్ని ప్రారంభించిన రెండు రోజులకే తాళం వేశారు. జాతర సందర్భంగా మ్యూజిం వద్ద ఆదివాసీ సంప్రదాయాలతో కూడిన డోలు వాయిద్యాలు, ధింసా నృత్యాలను చేయించేందుకు వివిధ ప్రాంతాల నుంచి ఆదివాసీ కళాకారులను పిలిపించారు. కాని అధికారులు మ్యూజియానికి తాళం వేయడంతో కళాకారులు మ్యూజియం ప్రధాన ద్వారం వద్ద కూర్చొని నిరసన తెలియజేశారు. అధికారుల తీరుపై భక్తులతోపాటు, మేడారం వచ్చిన పర్యాటకులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

Adivasi1

Comments

comments