Home మంచిర్యాల ఆదివాసీల హక్కులను హరిస్తున్న లంబాడీలు

ఆదివాసీల హక్కులను హరిస్తున్న లంబాడీలు

Adivasis struggling for peace

మనతెలంగాణ/మందమర్రి: ఆదివాసీల హక్కులను హరిస్తూ రాజకీయంగా, విద్య, ఉద్యోగ విషయాల్లో ఆదివాసీలకు తీరని నష్టం చేస్తున్నారని ఆదివాసీ నాయక్‌పోడ్ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు గంజి రాజన్న , ప్రధాన కార్యదర్శి పెద్దిరాజన్నలు ఆరోపించారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలోని విధం గా తెలంగాణ రాష్ట్రంలో ఎస్‌టిలుగా చలామని అవుతూ తమకు రావాల్సిన హక్కులను అనుభవిస్తున్నారన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లాల్లో 40,50 వేలల్లో ఉన్న లంబాడీలు ఇప్పుడు లక్షల జనాభాగా దొంగ లెక్కలు చూపుతున్నారన్నారు. ఆదివాసీ హక్కుల కోసం శాంతియుతంగా పోరాడుతున్న ఆదివాసీ నాయకులను ప్రభుత్వం అక్రమంగా ఆరెస్టు చేసిందని వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లంబాడీలను ప్రభుత్వం ఎస్‌టి జాబితా నుండి తొలగించే వరకు ఆదివాసీ సేవా సంఘం ఆధ్వర్యంలో శాంతియుతంగా ఉద్యమాలు చేస్తామని వారు హెచ్చరించారు. సమావేశంలో ఆసంఘం రాష్ట్ర నాయకులు గుండం రామస్వామి, కొమ్ముల బాపు, మేషినేని రాజయ్య, రాజమల్లు, పల్లె మల్లేష్ పాల్గొన్నారు.