Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

అమెరికాలో ‘గూఢచారి’

Adivi-Sesh

‘క్షణం’ లాంటి హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా తెలుగు అమ్మాయి శోభిత ధూళిపాళ్ల కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది. ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా, టి.జి.విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ “ఇప్పటివరకు తెలుగు తెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్‌తో ‘గూఢచారి’ తెరకెక్కుతోంది. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం అమెరికాలో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాం”అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీః షానిల్ డియో, సంగీతంః శ్రీచరణ్ పాకాల, ఎడిటర్‌ః గ్యార్ బి.హెచ్, మాటలుః అబ్బూరి రవి.

Comments

comments