Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలి

Exam Centers Allotted Only Government schools in Kumru Bheem Asifabad

నిర్మల్‌టౌన్:జిల్లాలో 10వ తరగతి పరీక్షలు మొదటిసారి నిర్వహిస్తున్నందున ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని శాఖలు సమన్వయంతో విజయవంతం  చేయాలని జిల్లా ఇంచార్జీ కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య అధికారులను సూచించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పదవతరగతి పరీక్ష నిర్వాహణ పై జిల్లా విద్యాశాఖాధికారి వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పడిన తదుపరి మొదటిసారి నిర్వహిస్తున్న పదవతరగతి పరీక్షలను అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని సూచించారు.

మార్చి 14 నుంచి మార్చి 30 వరకు ఉదయం 9ః30 గంటల నుండి మధ్యాహ్నం 12ః15 గంటల వరకు నిర్వహించనున్న పదవ తరగతి పరీక్షలను విద్యార్దులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చుడాలన్నారు.    పిల్లలకు అసౌకర్యం కలుగకుండా నిర్ణీత సమయంలో వివిధ పాఠశాలలో నుండి వచ్చే విద్యార్దుల సౌలభ్యం కోసం బస్సు సౌకర్యం కల్పించాలన్నారు. మార్చి 14 నుండి 30 వరకు నిర్వహించనున్న పరీక్ష జిల్లా నుండి 9705 మంది విద్యార్దిని,విద్యార్దులు పాల్గొ ంటున్నారని ఇందులో 4516బాలురు,4820 బాలి కల రెగ్యూలర్, ప్రైవేటు 251 బాలురు,118 బాలికల పాల్గొ ంటున్నారని  వీరి కోసం 45 సెంటర్లను ఏ ర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్య క్రమంలో  జిల్లా రెవెన్యూ అధికారి నగేష్, డిఎంబిహెచ్‌ఓ జలపతినాయక్,డిటిఓ కరుణాకర్,వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Comments

comments