Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ప్రశాంతంగా బిఇడి ప్రవేశపరీక్ష

examనల్లగొండలో 264 మంది, సూర్యాపేటలో 96 మంది గైర్హాజరు
పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఎంజియు రిజిస్ట్రార్
నిమిషం ఆలస్యం కారణంగా వెనుదిరిగిన నలుగురు విద్యార్థులు
నల్లగొండ టౌన్ : తెలంగాణ రాష్ట్రంలో 2016-17 సంవత్సరానికి గానూ బిఇడికోర్సులో ప్రవేశ పరీక్షలో భాగంగా నల్లగొండ పట్టణంలో శుక్రవారం ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు సెట్ కన్వీనర్ సల్మాన్‌రాజు, సంజీవరెడ్డి, రణదీవేలు తెలిపారు. పరీక్షలకు నల్లగొండ పట్టణంలో 8 పరీక్ష కేంద్రాల్లో 3089 మంది హాజరుకావల్సి ఉండగా 2825 మంది హాజరుకాగా 264 మంది గైర్హాజరయ్యారు. అదేవిధంగా సూర్యాపేటలో ఆరు పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించగా 1240 మంది హాజరుకావల్సి ఉండగా 96 మంది హాజరుకాలేదు. జిల్లా వ్యాప్తంగా 360 మంది విద్యార్ధులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్ధులు ఆయా పరీక్ష కేంద్రాలలో ఉరుకుల పరుగులతో కనిపించారు. మహాత్మాగాంధీ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఉమేష్‌కుమార్ నల్లగొండ పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాలను తనిఖీ చేశారు. పరీక్షలో ఎటువంటి అవకతవకలు జరుగకుండా బయోమెట్రిక్ విధానంతో మరోసారి బిఇడి ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఒక నిమిషం ఆలస్యం కారణంగా ఎన్జీ కళాశాలలో ముగ్గురు, ఉమెన్స్ కళాశాలలో ఒక్కరు పరీక్షకు అనుమతి ఇవ్వకపోవడంతో బాధతో వెనుదిరిగారు.

Comments

comments