Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

కొత్త కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానం

centrel-university

సోమాజిగూడ: 2018-19 కొత్త కోర్సులకు సెంట్రల్ యూనివర్సీటీ ఆఫ్ హైదరాబాద్ 5 తారీఖు నుంచి అడ్మిషన్స్‌లు స్వీకరిస్తున్నట్లు వైస్ చాన్స్‌లర్ అప్పారావు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు. అర్హత పరీక్ష ద్వారా 1945 సీట్లకు గాను 117 ( 15 ఇంటిగ్రేటెడ్, 42 పిజి కోర్సు లు, 13 ఎం ఫిల్, 6 ఎంటెక్, 41 పిహెచ్ డి ) కోర్సులకు అడ్మిషన్‌లు ఇవ్వనున్నట్లు తెలిపారు. వీటితో పాటు కొత్త కోర్సులు ఎమ్మెస్సి/పిహెచ్‌డి ఇంటిగ్రేటెడ్‌లో ఎంఎ ఎడ్యుకేషన్, పిహెచ్‌డి ఎడ్యుకేషన్, పిహెచ్‌డి ట్రాన్స్‌లేషన్ స్టడీస్, పిహెచ్‌డి నానో సైన్స్ ,టెక్నాలజీ, పిజి డిప్లమా ఇన్ సంక్రిట్‌లను ప్రవేశ పెడుతున్నట్టు చెప్పారు. 29 రాష్ట్రాల విద్యార్థ్దుల నుంచి ధరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపా రు. మరిన్ని వివరాలకు http://acad. uohyd.ac.in ద్వారా లాగిన్ అవ్వాలని చెప్పారు.

Comments

comments