Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

రెండు ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు నిల్

ఈ రెండు కళాశాలలను ఒక్క విద్యార్థ్థీ ఎంచుకోలేదు

రెండవ విడత ఎంసెట్ సీట్ల కేటాయింపు పూర్తి
60 కళాశాలల్లో 100 శాతం ప్రవేశాలు
ఇందులో 12 వర్శిటీ, 48 ప్రైవేట్ కాలేజీలు
రాష్ట్రవ్యాప్తంగా 51,157 ఇంజినీరింగ్ సీట్లు భర్తీ
మిగిలిన సీట్లు 14,491

Admissions

హైదరాబాద్ : ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఎంసెట్ కౌన్సెలింగ్‌లో రెండు ఇంజనీరింగ్ కళాశాలల్లో ఒక్క అడ్మిషన్ కూడా జరగలేదు. ఈ కళాశాలలకు ఒక్క విద్యార్థి కూ డా ఆప్షన్స్ ఎంచుకోకపో వడం తో ప్రవేశాలు నమోదు కాలేదు. ఏడు కళాశాలల్లో తొమ్మిదికంటే తక్కువ మంది విద్యార్థుల అడ్మిషన్‌లు నమోదు కాగా, 24 కళాశాలల్లో 50లోపు ప్రవేశాలు, 43 కళాశాలల్లో 100లోపు ప్రవేశాలు నమోదయ్యాయి. ఈ సారి 60 కళాశాలల్లో 100 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఇందులో 12 యూనివర్సిటీ కళాశాలలు, 48 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. కొన్ని కళాశాలలు నిర్వహణకు ఆర్థిక భారం అవుతోందనే కారణంతో కొత్త ప్రవేశాలకు ఆసక్తి చూపలేదు. ఈ విద్యాసంవత్సరం కన్వీనర్ కోటా కింద 189 కళాశాలల్లో మొత్తం 65,648 సీట్లు అందుబాటులో ఉండగా తొలి, రెండవ విడత కౌన్సిలింగ్‌లో ఇంజనీరింగ్‌లో 51,157 (77.93 శాతం) సీట్లు భర్తీకాగా, ఎంపిసి స్ట్రీమ్‌కు రెండవ విడత కౌన్సిలింగ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో మరో 13,206 సీట్లు భర్తీ అయ్యాయి. అలాగే బి.ఫార్మసీలో 113 కళాశాలల్లో మొత్తం 3,087 సీట్లకు 141 (4.57 శాతం) సీట్లు కేటాయించగా, 2,946 సీట్లు మిగిలాయి. ఫార్మా డిలో 49 కళాశాలల్లో 486 సీట్లకు 47 (9.67 శాతం) సీట్లు కేటాయించగా, 439 సీట్లు ఖాళీగా మిగిలాయి. రెండవ విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థులు ఈ నెల 15లోగా ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో రిపోర్టింగ్ చేయాలని సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ తెలిపారు.
22 శాతం ఇంజనీరింగ్ సీట్లు ఖాళీ
రెండు విడతల ఎంసెట్ కౌన్సెలింగ్ తర్వాత ఇంజనీరింగ్‌లో 22.07 శాతం సీట్లు ఖాళీగా మిలిగాయి. ఈ విద్యాసంవత్సరం ఎంసెట్ (ఎంపిసి స్ట్రీమ్)లో 1,02,615 మంది విద్యార్థులు అర్హత సాధించగా, 62,901 మంది సర్టిఫికెట్ వెరిఫికేషర్‌కు హాజరయ్యారు. కన్వీనర్ కోటా కింద మొత్తం 65,648 ఇంజనీరింగ్ సీట్లు అందుబాటులో ఉండగా, రెండు విడతల కౌన్సెలింగ్ తర్వాత 14,491 సీట్లు ఖాళీగా మిగిలాయి.

Comments

comments