Home ఆదిలాబాద్ కాలకూట విషం

కాలకూట విషం

MILK2మన తెలంగాణ/ఆదిలాబాద్ ప్రతినిధి: ప్రజల అవసరం, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న కొంత మంది వ్యక్తులు పాల వ్యాపారులుగా అవతారమెత్తుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రసాయనాలతో కూడిన పౌడర్‌ను కలుపుతూ కృత్రిమ పాలను తయారు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గేదె, ఆవు పాల పేరిట ప్రచారం చేసుకుంటూ కల్తీ పాలు తయారు చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి. అయితే సహజమైన పాలను సేకరించకుండానే డైయిరీ పార్లర్లను ఏర్పాటు చేసి కృత్రిమ పాలను తయారు చేస్తున్నారు. ప్రధాన కూడళ్లు మార్కెట్ ప్రాంతాల్లో ఈ డైయిరీ పార్లర్‌ను ఏర్పాటు చేసి అడ్డగోలుగా కల్తీ పాలను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తదితర ప్రాం తాల నుంచి సంచుల కొద్ది ఈ కల్తీ పాల పౌడర్‌ను దిగిమతి చేసుకుంటూ ప్రత్యేక అడ్డాల్లో ఈ కల్తీ పాలను తయారు చేస్తున్నారు. కల్తీ పాలను ప్యాకెట్లలో నింపి కొన్ని బ్రాండ్‌ల పేరిట విక్రయిస్తున్నారు. మరి కొంతమంది వ్యాపారులు ఒక అడుగు ముందుకు వేసి ఐఎస్‌ఐ ముద్రను సైతం అతికిస్తూ నకిలీ దందాను ఎల్లలు దాటిస్తున్నారు. కాగా రోజు రోజుకు పాల వినియోగం విపరీతంగా పెరిగిపోతుండడం సహజమైన పాల ఉత్పత్తి తగ్గిపోతుండడం నకిలీ వ్యాపారులకు కలిసొచ్చినట్లు చెబుతున్నారు. మార్కెట్‌లో పాలకు డిమాండ్‌ను ఆసరా చేసుకుంటున్నా వ్యాపారులు కల్తీ పాలను పెద్ద ఎత్తున తయారు చేస్తుండడం గమనార్హం. ఎలాంటి డైయిరీ ఫాంలు లేకుండానే పాల విక్రయాలు జరుగుతున్నప్పటికి అధికారులు మాత్రం ఈ దిశగా దృష్టి సారించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రాబోయే దీపావళి పం డుగను దృష్టిలో ఉంచుకొని కల్తీ వ్యాపారులు పెద్ద ఎత్తున నకీలి పాల పౌడర్‌ను దిగుమతి చేసుకున్నట్లు సమాచారం. అయితే ఆహార నియంత్రణ అధికారులు కల్తీ ఆహార ఉత్పతుల విషయంలో మొదటి నుంచి నిర్లక్షం చేస్తుండడం, అక్రమ వ్యాపారులకు కలిసొచ్చినట్లు చెబుతున్నారు. అధికారుల నిర్లక్షం, మా ముళ్ల వ్యవహారంతో కల్తీ వ్యాపారులు రోజు రోజుకు తమ ఉత్పత్తులను మరింతగా పెంచుకుంటున్నారు. ధర కూడా సాదారణ పాల కన్న 5, 10 రూపాయలు ఎక్కువగానే వసూళు చేస్తున్నారంటు న్నారు. ఇప్పటి కైన సంబంధిత యంత్రాంగం కల్తీ పాల విక్రయాలను అరికట్టి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కోరుతున్నారు.