Search
Thursday 15 November 2018
  • :
  • :

కల్తీ కల్లు కల్లోలం కారకులెవరు?

TADDYపల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రలో నా పల్లె బంధీ అయ్యిందో కనిపించని కుట్రలో ఈదు లన్ని ఒట్టి మొద్దులైనవి ఈత కల్లు బంగార మైనది, మందు కలిపిన కల్లును తాగి మంది కల్లో నిండు ఊసునైవి… అంటూ గోరేటి వెంకన్న రెండు దశాబ్దాల క్రితమే తెలంగాణలో కల్లు ఘోసను పాట రూపంలో చెప్పారు. కనిపించని కుట్రల్లో ఈ ప్రాంతంలో కల్లుగీత వృత్తి మసకబారింది. తెలంగాణ జన జీవన సంస్కృతిలో అంతర్భాగమైన కల్లు తెలంగాణలో అంటరానిదైనది.
తెలంగాణలో నేడు కల్తీ కల్లు అందక ప్రజలు చాలామంది అసుపత్రుల దారి పడుతున్నారు. ఇక్కడ ఇదొక విషాదకర పరిస్థితి. ఆరోగ్యకరమైన కల్లు అందించే బాధ్యత ఎక్సైజ్ శాఖదే. తెలంగాణలో కల్తీ కల్లు మూడు దశాబ్ధాలుగా కొందరు వ్యవస్థీకృతం చేశారు. మొదటి నుండి సంఘాలుగా మేము చెబుతున్నాం. కల్తీ కల్లు వేరు, సాంప్రదాయ కల్లు వేరు. కల్తీ కల్లు అమ్మిన వ్యాపారులు కోట్లకు పడగ లెత్తితే కల్లుగీత వృత్తిదారుల జీవితాలు దిన దినం కునారిల్లుతున్నాయి. కల్తీ ఉన్నచోట తప్పకుండా వ్యాపారులకు లాభం ఎక్సైజ్ అధికారుల ప్రమేయం తప్పక ఉంటుంది. ఇక్కడ కేవలం వ్యాపారులు కొందరు మాత్రమే లాభాలు పంచుకుంటారు. గ్రామీ ణ ప్రాంత గీతవృత్తిదారులు మాత్రం కల్లు అమ్ము కొని ప్రజాస్వామ్యయుతంగా సొసైటీలు నడుపు కుంటున్నారు. వాస్తవానికి వ్యాపారస్తుడికి కులం, వర్గం, ప్రాంతం ఏదీ ఉండదు, లాభాలే ముఖ్యం. నిజాం పాలనలో ఈ ప్రాంతంలో గీతవృత్తి వర్ధిల్లింది. అప్పటి ప్రభుత్వాలు ఈత, తాటి చెట్లను పెంచడం, రక్షణ చట్టాలు తేవడం జరిగింది. ఆ తరువాత కాలంలో ఈ ప్రాంతంలో ఈ వృత్తి పాలకుల వివక్ష కు గురైంది. లక్షలాది కుటుంబాలు ఆధార పడిన ఈ వృత్తి క్రమేణా సంక్షోభంలోకి వెల్లిం ది. రాజకీయ పార్టీలకు వృత్తిదారుల ఓట్ల మీద ఉన్న ప్రేమ, వృత్తుల రక్షణ విషయంలో లేకుండా పోయిం ది. లక్షల కోట్ల బడ్జెట్‌లు ప్రతి సంవత్సరం, అసెంబ్లీ సాక్షిగా ప్రవేశపెడుతున్నా, గీతవృత్తిదారుల అభివృ ద్ధికి కనీసం టీ కప్పు బడ్జెట్ కూడా కేటాయించక పోవడం వివక్షతకు నిదర్శనం. కొన్ని జిల్లాల్లో కల్తీ అనేది జగమెరిగిన సత్యం. ఇందులో సందేహం లేదు. దానికి కారణాలు వెతకాలి, ఒకవైపు కల్తీని అరికడుతూనే, మరోవైపు గీతవృత్తి పునర్జీవనానికి చర్యలు చేపట్టవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ గీత వృత్తిదారుల పట్ల తెలంగాణ ప్రభుత్వం సాను కూల దృక్పథంతో వ్యవహరించింది. పెండింగ్ లో ఉన్న ఎక్స్‌గ్రేషియా 10 సంవత్సరాలది మొత్తం విడుదల చేయడం. వెయ్యి రూపాయల పెన్షన్ ఇవ్వడం, హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు తెరిపిం చడం. మిషన్ కాకతీయలో ఈత వనాలు పెంచడం, ప్రపంచ మెట్రో మేయర్ల సదస్సులో కల్లును మెనూగా పెట్టి అతిథులకు తాపించడం లాంటి నిర్ణయాలు ఎంతో గొప్పవి. తెలంగాణలో కల్లు అనేది ప్రజల జీవన విధానంతో మమేకం అయింది. సామాన్యు లకు అందుబాటులో ఉంది. ఈ వృత్తి గతంలో ఎంతో గౌరవ ప్రదమైంది. గత పాలకుల విధానాల వల్ల ఈ వృత్తి ఈ ప్రాంతంలో కాలకూటంగా మారింది. ఇందులోకి వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రవేశించి ఈ వృత్తిని మలినం చేసారు. వ్యాపారుల లాభాపేక్ష వల్ల ఎక్సైజ్ సిస్టం దెబ్బతిన్నది.
ఊరు మున్సిపాలిటీ పట్టణంమండువ కల్లు షాపుడిపో. గీతవృత్తిదారుడు ఎక్సైజ్ పాలసీ. కల్లు ఎక్కడి నుండి వస్తుంది. చెట్టు నెంబర్, చెట్ల కోట. దాని పర్యవేక్షణ, అంతా ఎక్సైజ్ అధికారులు కోఆప రేటివ్ ఇన్‌స్పెక్టర్లు పర్యవేక్షించాలి. అదంతా దెబ్బ తిన్నది. కొన్ని ప్రాంతాల్లో ఎక్సైజ్ విధానం ఊర్లకు ఊర్లు సొసైటీల నుండి వ్యాపారులు బెదిరించి షాపులు గుంజుకోవడం కల్తీ యధేచ్చగా చేయడం జరిగింది. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కొందరి వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. కల్తీ ఎవరు చేస్తున్నారో ఎక్సైజ్ అధికారులకు తెలుసు. దీని నుంచి బయటపడాలంటే ఇప్పుడున్న కల్లుగీత విధానం పూర్తిగా ప్రక్షాళన జరగాలి. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రాంతంలో మొత్తంగా కల్తీ లేదు. సాంప్రదాయ మంచి కల్లుకు తెలంగాణలో ఎంతో డిమాండ్ ఉంది. వరంగల్, నల్లగొండ, కరీం నగర్, ఖమ్మం మొదలగు అనేక జిల్లాల్లో ప్రజల ఆర్ధిక అసమానతలు లేకుండా కల్లు తాగుతున్నారు. వాడిక పట్టుకొని మంచి కల్లు అమ్మే మండువాలకు హైదరాబాద్ నుండి పోయి కల్లు తాగే సంప్రదాయం నేటికీ ఉంది. అంటే వృత్తిదారుడికి ప్రజలకు ఉన్న సంబంధం లాంటిది. రంగారెడ్డి, హైదరా బాద్ జిల్లాలకు గ్రామీణ ప్రాంతాల నుండి మంచి కల్లు వస్తుంది. చాలా డిపోల్లో మంచి కల్లు అందు బాటులో ఉంది. ఇక్కడ బాధ కలిగే అంశం ఏమిటి అంటే తెలంగాణలో కొందరు కల్లు వ్యాపారులు సిండికేట్ గా మారారు. వ్యాపారుల వల్ల ఈరోజు ఈ ప్రాంతం లో ఈ దౌర్భాగ్యం ఏర్పడింది. తెలంగాణ ప్రాంతంలో ఆరోగ్యకరమైన కల్లు అందాలంటే ముఖ్యమైన వృత్తిదారులు ఎవరో వారికే సొసైటీపై హక్కుదారుడి గా ఉండాలి. ప్రభుత్వం కల్లు డైరీలు ఏర్పాటు చేయాలి. తెలంగాణలో విస్తృతంగా తాటి ఈత వనాలు పెంచాలి. హరితహారం, మిషన్ కాక తీయలో గీత సొసైటీలను భాగస్వామ్యులను చేయా

లి. హైబ్రీడ్ తాటి, ఈత విత్తనాలు పెంచాలి. కల్తీ కల్లు నిరోధానికి ప్రజల్లో చైతన్యం తీసుకు రావడానికి ప్రచార జాతలు నిర్వ హించాలి. ప్రతి గ్రామా నికి 5 నుండి 10 ఎక రాలు గీత సొసైటీలకు ఇవ్వాలి. సొసై టీల నిర్వహణ పారదర్శ కంగా నిర్వ హించే విధంగా చర్యలు తీసు కోవాలి. అర్హులైన ప్రతి ఒక్కరికి సొసైటీలో భాగ స్వామ్యం కల్పించాలి. కాంబోడియా, సౌత్ అమె రికా, శ్రీలంక, దక్షిణ ఆఫ్రికా మొదలగు దేశాల్లోని కల్లు విధానాన్ని అధ్య యనం చేయాలి.
రచయిత: గౌడ్ ఐక్యసాధన సమితి రాష్ట్ర కన్వీనర్,
9949652024

Comments

comments