Home కరీంనగర్ కల్తీ పెట్రోల్ కలకలం

కల్తీ పెట్రోల్ కలకలం

Adulteration is petrol causedతిమ్మాపూర్‌: మండలంలోని నుస్తులాపూర్ శివారులో గల హైద్రాబాద్ రోడ్డు మార్గంలోని విజయ లక్ష్మి ఫిల్లింగ్ స్టేషన్ లో శనివారం కల్తీ పెట్రోల్ విక్రయం కలకలం సృష్టించింది. స్థానికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత రెండు రోజుల కిందట కొత్తపల్లి గ్రామానికి చెందిన నరసింహ 300 ఇచ్చి బంకులో పెట్రోల్ పోయమని కోరగా నీరు కలిపిన పెట్రోల్ తనకు విక్రయించారని బాధితుడు బంక్ వద్దకు చేరుకుని సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. తాను బైక్ ను మెకానిక్ వద్దకు తీసుకు వెళ్తే తప్ప నిజం తెలియలేదని బాధితుడు సిబ్బందితో వాపోయాడు. దీంతో ఈ విషయం చుట్టు ప్రక్కల గ్రామాలకు వ్యాపించింది. సమాచారం అందుకున్న మండల విలేకరులు బంక్ వద్దకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. సిబ్బంది మాత్రం తమ వద్ద కల్తీ లేదని కావాలంటే టెస్టింగ్ కి పంపుకోవచ్చన్నారు. తన బైక్ లోనే నీళ్లు పోయి కల్తీ అయి ఉండ వచ్చని సిబ్బంది అన్నారు. దీంతో బ్లూ కోటు సిబ్బంది అక్కడికి చేరుకుని బాధితుడిని స్టేషన్ రావాలని కోరగా… ఏం గొడవ లేదని సిబ్బందిని అడుగుతున్నామని బాధితుడు చెప్పడంతో గొడవ సర్ధుమనిగింది.