Search
Monday 24 September 2018
  • :
  • :

కల్తీ పెట్రోల్ విక్రయం

Adulteration Petrol sale in addakula
అడ్డాకుల: కల్తీ పెట్రోలును విక్రయిస్తున్నారని గమనించిన వినియోగదారులు ఇచ్చిన సమాచారంతో అడ్డాకుల మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై వున్న స్నేహ చికెన్ కంపెనికి సమీపంలో గల శ్రీ లక్ష్మినరసింహా పెట్రోలు బంక్‌ను పోలీసులు మూసివేయించిన సంఘటన ఆదివారం నెలకొన్నది. వినియోగదారుల కథనం ప్రకారం… ఉదయం బంక్‌లో బైక్‌కు పెట్రోలు వేసుకొని అదనంగా వాటర్‌ బాటిల్‌కు పెట్రోలును పోయించుకోగా అందులో మట్టి, నీటితో నల్లని రంగు ఉండడంతో పెట్రోలు కల్తీకీ గురైందని గుర్తించిన యువకులు బంక్ సిబ్భందితో వాగ్వాదానికి దిగారు. ఎంత మంది వినియోగదారులు వచ్చి పెట్రోలును పరిశీలించినా సాధారణంగా వుండే రంగు, వాసన లేకపోగా మట్టి కనిపించడంతో మెనేజర్ మల్లికార్జున్‌ను నిలధిశారు. అదనంగా కొత్తగా పెట్రోలు టాంకు ఏర్పాటు చెయ్యడం జరిగిందని అందులో మట్టి, కొంత నీరు ఉండి ఉండ వచ్చని  యువకులకు పొంతనే లేని సమాదానాలు ఇవ్వడంతో ఆగ్రహించిన యువకులు మీ తప్పులకు వాహనాలు దెబ్బ తింటే ఎవరు బాధ్యత వహిస్తారని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో మూసాపేట ఎస్‌ఐ, అడ్డాకుల పోలీసులు పెట్రోల్‌ బంక్ మెనేజర్‌తో మాట్లాడి బంక్‌ యజమాని, విజలెన్స్ అధికారుల సమక్షంలో పెట్రోలును పరిశీలించిన తర్వాత కల్తీ నిర్ధారణ అయితే చట్టపరమైన చర్యలు తీసుకోబడుతాయని పెట్రోల్ శాంపిల్స్‌ తీసుకొని తాత్కాలికంగా పెట్రోలు బంక్‌ను మూసివేయించారు. పోలీసులు అక్కడి నుండి యువకులకు నచ్చజెప్పి పంపించారు.

Comments

comments