Home జగిత్యాల అన్నింటికీ అదే నూనె!

అన్నింటికీ అదే నూనె!

Fast-Food

టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలపై కొరవడిన నిఘా
ప్రజల ఆరోగ్యంపై నిర్లక్ష్యం
రాయికల్: ప్రజారోగ్యం పట్టని అధికారుల నిర్వాకం వల్ల టిఫిన్ సెంటర్లు, ఫాస్టు ఫుడ్ కేంద్రాల నిర్వహకులకు వరమైంది. ఆయా కేంద్రాల నిర్వహకులు అధికా రుల సహకారంతో ప్రజలను అందినంతా దండుకుంటున్నా రు. కల్తీ నూనెతో కొందరు వ్యాపారం నిర్వహిస్తుండగా అదే నూనెతో రోజుల తరబడి వంట చేస్తూ ప్రజల ఆరోగ్యాన్ని హ రిస్తున్నారు. రాయికల్ మండల పరిధిలో 27 గ్రామాలుండ గా మల్లాపూర్, మేడిపెల్లి మండలాల్లోని కొన్ని గ్రామాలకు రాయికల్ ప్రధాన వ్యాపార కేంద్రంగా ఉంది. అయితే రా యికల్‌లో చాల టిఫిన్ సెంటర్లు ఉండగా వీటిలో ఎక్కువ శా తం ఆహర పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలు పాటించడం లే దనే ఆరోపణలు ఉన్నాయి.

ప్రజల ఆహర ఆలవాట్లలో నానాటికి మార్పు ఎక్కువగా కన బడుతుంది. గతంలో ప్రజలు ఇంటివద్దే అన్నం తిని పను లకు వెళ్లేవారు. కాని మారిన కాలగమనంలో ఉదయం, సాయంత్రం చాల మంది ప్రజలు టిఫిన్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాల వైపు చూస్తున్నారు. ధరల గూర్చి ఆలోచించకుం డానే టిఫిన్ చేసి తమ తమ పనుల్లో బిజీగా ఉంటున్నారు. వినియోగ దారుల అవసరాన్ని ఆసరగా చేసుకుంటున్న టి ఫిన్,ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహకులు తక్కువ ధరలకు వచ్చే నూనె, ఇతర వంట పదార్థాలను తీసుకువచ్చి వాటితో ఆ హార పదార్థాలను తయారు చేసి వినియోగదారులకు అంట గడుతున్నారు.

కొన్ని టిఫిన్ సెంటర్ల నిర్వహకులు రోజుల తరబడి అదే నూనెతో టిఫిన్‌లను తయారు చేస్తు ప్రజలను దగా చేస్తున్నారు. రోజుల తరబడి కాగిన నూనెతోనే వంట పదార్థలను తయారు చేయడంతో ఆ పదార్థలను తినే వి నయోగదారులు రోగాల బారిన పడటం తథ్యం. కల్తీ వస్తువు లతో కాగిన నూనెలతో పదార్థలను తయారు చేసే నిర్వ హకుల వ్యవహారంపై ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ఓ టిపిన్ సెంటర్‌లో టిఫిన్ చేసిన వినియోగదారు లు ఇంటికి వెళ్లిన తర్వాత వాంతులతో ఇబ్బందులు పడ్డ సంఘటన బయటకు వచ్చింది. ఈ వ్యవహారంపై సదరు టి ఫిన్ సెంటర్ నిర్వహకుడిని నిలదీస్తే తమ తప్పేం లేదని తప్పించుకోవడం గమనర్హం.

పరిసరాలంతా అపరిశుభ్రమే…
స్వచ్ఛతకు మారుపేరుగా ఉండాల్సిన టిఫిన్ సెంటర్లు, ఫా స్ట్‌ఫుడ్ కేంద్రాలు అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. ఈగలు, దోమలతో కేంద్రాలు కంపుకొడుతున్న అమ్యామ్యా లకు అలవాటు పడ్డ అధికారులు ఈ వైపు కన్నేత్తి చూసిన దాఖాలాలు లేకపోవడం శోచనీయం.

అధికారుల నిర్లక్ష్యం
ప్రజాప్రతినిధుల అలసత్వంతో టిఫిన్ సెంటర్ల నిర్వహణలో అశ్రద్ద వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు. టిఫిన్ సెంటర్ల సమీపంలో పందులు ,కుక్కల తాకిడి ఎక్కువగా ఉండటంతో అపరిశుభ్రత వాతావరణంలో కేం ద్రాల నిర్వహణ సాగుతుంది. ఈ విషయమై గ్రామపంచా యతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం ఉండటం లేదనే విమర్శలున్నాయి.

అధికారుల తీరుపై అనుమానాలు ?
రాయికల్ మండల పరిధిలో రాయికల్, అల్లీపూర్, ఇటిక్యాల గ్రామాల్లో టిఫిన్ సెంటర్లు, ఫాస్టుఫుడ్ కేంద్రాలు ఉండగా వీటిలో చాల మంది నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలు ఏ మాత్రం పాటించడం లేదు. ఈ కేంద్రాలపై పర్యవేక్షణ చేయాల్సిన అధికారులు కన్నేత్తి చూడకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతు న్నారు. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన అధికారులు ఇప్పటి కైనా మేల్కోంటే బాగుంటుందని పలువురు కోరుతున్నారు.