Home నవ విజ్ఞానం శరీరం బరువు తగ్గించే కడుపులోని సాధనం

శరీరం బరువు తగ్గించే కడుపులోని సాధనం

Adults and children suffer from obesity

 

వాషింగ్టన్ : ఆహారం తునకలు చిన్నవి కొద్దిగా తీసుకున్నా ఆకలి తీరి కడుపు నిండా తినినంత సంతృప్తి కలిగించే భావం మెదడుకు కలిగించే సాధనాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. బ్యాటరీ ఫ్రీ, సులువుగా లోపలికి అ మర్చగల ఈ సాధనం మెదడును భ్రమింప చేస్తుంది. స్థూలకాయం రాకుండా ముందుగా జాగ్రత్తలు తీసుకోవచ్చు. యూనివర్శిటీ ఆఫ్ విస్కన్‌సిన్‌మేడిసన్ పరిశోధకులు ఈ సాధనాన్ని ప్రయోగశాలలో పరీక్షించారు. ముందుగా ఈ సాధనాలను ఎలుకల్లో ప్రయోగించి పరీక్షించ గా వాటి శరీ రం బరువు 40 శాతం వరకు తగ్గడానికి దోహదపడింది.

ప్రపంచం మొత్తం మీద 700 మిలియన్ కన్నా ఎక్కువగా పెద్దలు, పిల్లలు స్థూలకాయంతో బాధపడుతున్నారు. సులువుగా అమర్చగల బ్యాటరీ ఫ్రీ అయిన ఈ సాధనం స్థూలకాయాన్ని హరింప చేసే ఆయుధంగా పరిశోధకులు అభివర్ణిస్తున్నారు. సెంటిమీటర్ కన్నా తక్కువ పరిమాణం కలిగిన ఈ సాధనం శరీరంలో అమర్చితే ఎలాంటి రిస్కు ఉండదని, శరీరానికి సురక్షితమని చెప్పారు. కడుపులో సహజంగా కుదిపివేసే విరేచనాల వేడి నుంచి ఈ సాధనం విద్యుత్ నాడులను ఉత్పత్తి చేస్తుంది. వేగస్ నాడీకి ఈ విద్యుత్ నాడులు విడుదల అవుతాయి. దీంతో మెదడుకు సంధానం కలుగుతుంది.

                                                                                                                 – సైన్స్ విభాగం

Adults and children suffer from obesity

Telangana Latest News