Home వార్తలు విఎఫ్‌ఎక్స్ రంగంలోనూ దూసుకుపోతున్నాడు

విఎఫ్‌ఎక్స్ రంగంలోనూ దూసుకుపోతున్నాడు

Kalyan-Ramనందమూరి కళ్యాణ్‌రామ్.. నందమూరి నట వారసుడిగా, ఎన్టీఆర్ ఆర్ట్ బ్యానర్‌పై సినిమాలు నిర్మించే నిర్మాతగా అందరికీ తెలుసు. కానీ కళ్యాణ్‌రామ్ సినిమాల్లోకి రాకముందు ఒక బిజినెస్‌మెన్. కానీ సినిమాల మీద ఉన్న మక్కువతో కళ్యాణ్‌రామ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చాడు. సరికొత్త టెక్నాలజీస్ మీద అనుభవం ఉన్న కళ్యాణ్‌రామ్ సినిమాకు సంబంధించిన ఓ బిజినెస్‌ను కూడా ప్రారంభించాడు. సినిమాలకు విజువల్ ఎఫెక్ట్‌ను అందించే ఒక సంస్థను నెలకొల్పాడు. అద్విత అనే పేరుతో విఎఫ్‌ఎక్స్ అనే కంపెనీని మొదలుపెట్టాడు. ఇది మొదలై చాలా కాలమైంది. ఇప్పటికే అద్విత విఎఫ్‌ఎక్స్ వారు నాన్నకు ప్రేమతో, సుబ్రమణ్యం ఫర్ సేల్, కృష్ణాష్టమిలాంటి పెద్ద సినిమాలతో పాటు చిన్న సినిమాలకు కూడా పనిచేశారు. ఈ కంపెనీ ఇస్తున్న అవుట్‌పుట్ దృష్టా మంచి డిమాండ్ పెరుగుతోంది. ఇక కళ్యాణ్‌రామ్ తన తదుపరి సినిమాను పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో చేయనున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ నుంచి సెట్స్‌పైకి వెళ్లనుంది.