Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

హాట్ టాపిక్‌గా మారిన ఐశ్వర్య, రణ్‌బీర్‌ల ప్రేమాయణం!

aish-and-ranbheerrrప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్‌జోహార్ నిర్మిస్తున్న ‘యే దిల్ హై ముష్కిల్’ ఫస్ట్ టీజర్ విడుదలయ్యింది. రణబీర్ కపూర్, ఐశ్వర్య రాయ్, అనుష్కశర్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మంగళవారం కరణ్‌జోహార్ తన ట్విట్టర్‌లో ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో చుట్టేస్తోంది. అయితే ఈ చిత్రంలో ఐశ్వర్యరాయ్, రణ్‌బీర్ జంట మధ్య బ్రహ్మాఢమైన కెమిస్ట్రీ వర్కౌట్ అయినట్లుగా బాలీవుడ్ పరిశ్రమల్లో ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మూవీలో ఐశ్యర్య తన అందంతో ఆకట్టుకుంటున్నారు. కాగా, చాలా కాలంగా ఆమె సినిమాలకు అనుకున్నంత ప్రేక్షకాదరణ లేకపోవడంతో ఇప్పుడు ‘ యే దిల్ హై ముష్కిల్ ’ చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ఇవ్వడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. వన్‌సైడ్ లవ్, డీప్ ఫ్రెండ్‌షిప్, హార్ట్ బ్రేక్ అంశాలతో హృదయాలను కదిలించే పనిపెట్టుకున్నారు దర్శకుడు కరణ్‌జోహార్.
ఈ టీజర్‌ను తిలకించిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ.. కరణ్‌జోహార్‌ను తన ట్వీట్టర్ ద్వారా ప్రశంసించాడు. శృంగారభరితంగా అలరించనున్న ఈ చిత్రం టీజర్ సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. రణ్‌బీర్ కపూర్ తొలిసారి ఐశ్వర్యతో కలిసి నటిస్తున్నారు. వీరి మధ్య నడిచే ప్రేమ, శృగార భరితమైన సన్నివేశాలు ఈ సినిమాకు హైలైట్స్ కానున్నాయి.
ఇదిలా ఉండగా ఈ సినిమాలోనే బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తారనే సమాచారం. ఈ సినిమాకు టైటిల్ ట్రాక్‌ను కూడా కరణ్‌జోహార్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. ప్రేమ, శృంగారం,ఉద్వేగపూరితమైన సన్నివేశాలతో చిత్రీకరించిన ఈ సినిమాను వచ్చే దీపావళి పర్వదినాన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Comments

comments